ముంబై: ఇటీవల ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆ జట్టు పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాలు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌చాట్‌లో ముచ్చటించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మధ్యలో దూరిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు యజ్వేంద్ర చహల్.. తనను ముంబై ఇండియన్స్ మిస్ అవుతుందా అంటూ మాట కలిపాడు. దీనికి రోహిత్‌కు కూడా తగిన సమాధానమే ఇచ్చాడు. ‘ నీ గురించి ఆర్సీబీకి చెబుతాం.. ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడాలనుకుంటున్నావని ఆర్సీబీ యాజమాన్యానికి తెలియజేస్తా. నీ వేషాలు మీ కెప్టెన్ కోహ్లి కూడా చెబుతా. అయినా నిన్ను మిస్ అవ్వాల్సిన అవసరం మా జట్టుకు లేదే. మేము గెలవకపోతే నిన్ను మిస్ అయినట్లు. మరి మేము గెలుస్తున్నాం కదా బాస్’ అంటూ రోహిత్ బదులిచ్చాడు. అవును..అవును చహల్ విషయం కోహ్లికే చెప్పేల్సిందే అంటూ బుమ్రా ఆ చాట్‌లో రోహిత్‌కు మద్దతుగా నిలిచాడు. (ఏంటి నీ వేషాలు.. కోహ్లితో చెప్పాలా?)
ముందు కోహ్లిని ఔట్ చేయండి.. చహల్ స్ట్రాంగ్ రిప్లై