కరోనా: జిల్లాలో ఒకే రోజు ఆరు పాజిటివ్‌ కేసులు

సూర్యాపేట : జిల్లాలో ఈ రోజు(సోమవారం)కొత్తగా ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యినట్లు కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి తెలిపారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 8కి చేరింది. వీరిలో సూర్యపేట పట్టణానికి చెందిన ఇద్దరితోపాటు, కుడకుడలో వచ్చిన వ్యక్తి బంధువులు.. నాగారం మండలం వర్ధమానుకోటకు చెందిన 6గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కలెక్టర్‌ తెలిపారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో సుమారు 14 వార్డుల్లో రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని, సామాజిక దూరం పాటించి కరోనా నివారణకు తోడ్పడాలని కోరారు. (పిల్లి కోసం పోలీసులపై హైకోర్టులో పిటిషన్‌)