ముంబై : యువతి అనుమతి లేకుండా ఆమె ఫొటోలు తీయటమే కాకుండా అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి సంవత్సరం జైలు శిక్ష విధించింది పోక్సో కోర్టు. ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును కోర్టు శుక్రవారం వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. 2018 సంవత్సరంలో ముంబై తిలక్‌నగర్‌లో వాసిమ్ షేక్ అనే వ్యక్తి 17 ఏళ్ల యువతి అనుమతి లేకుండా ఆమె ఫొటోలు తీశాడు. శరీరంపై తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ యువతి గట్టిగా అరవటం మొదలుపెట్టింది. ఆమె అరుపులు విన్న చుట్టుపక్కలి వారు అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. శుక్రవారం జరిగిన కోర్టు విచారణలో బాధితురాలు మాట్లాడుతూ.. ‘‘ నా పదవ తరగతి పూర్తి చేసుకుని కంప్యూటర్ కోర్సులో చేరుదామని ప్లాన్ చేసుకుంటున్నా.
అసభ్యకరంగా ప్రవర్తించాడు, ఫొటోలు తీశాడు